హైదరాబాద్, 31 జూలై (హి.స.)
రాష్ట్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల
అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాజాగా.. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు. అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ కామెంట్ చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్