తెలంగాణ, వరంగల్. 31 జూలై (హి.స.)
గురువారం మధ్యాహ్నం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థినిలకు అందించాల్సిన
ఆహారానికి వాడే సరుకుల్లో కుళ్లిన కూరగాయలు, అల్లం పేస్ట్ నిలువలపై కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల డైనింగ్ హల్లో నిల్వ చేసిన కూరగాయల్లో కుళ్లిన కూరగాయలను కలెక్టర్ గుర్తించారు. రేడిమేడ్ గా కొనుగోలు చేసిన అల్లం బాక్స్ వాసనతో ఉండటం, ఎప్పటికప్పుడు అల్లం తయారు చేసుకోవాలి గాని రేడిమేడ్ గా కొనుగోలు చేయకూడదన్నారు.
గ్రౌండ్ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో సిబ్బందితో బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతిదీ నోట్ చేసుకున్నామని కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు