భారత్, రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్.. టారిఫ్స్కు సిద్ధం కావాలని హెచ్చరిక!
దిల్లీ: 31 జూలై (హి.స.) భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ 25 శాతం టారీఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని కూడా చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన
Donald Trump


దిల్లీ: 31 జూలై (హి.స.)

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ 25 శాతం టారీఫ్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని కూడా చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రష్యాతో భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని గురువారం ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. కానీ, వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని తెలిపారు. తాము, భారత్ తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నాం.. ఎందుకంటే అత్యధికంగా సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. ఇక, రష్యా, యూఎస్‌లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande