హైదరాబాద్, 4 జూలై (హి.స.)
2025-2027 కాలానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీని (ఎంఏసీ) రాష్ట్ర శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ఏర్పాటు చేశారు. ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గా, పోలోజు పరిపూర్ణాచారిని కో చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు 13 మంది సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర శాసనసభ సంయుక్త కార్యదర్శి సీహెచ్. ఉపేందర్ రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో ఐతరాజు రంగరావు, బొడ్లపాటి పూర్ణచంద్రరావు, లక్కడి వెంకట్ రామ్ రెడ్డి, పోలంపల్లి ఆంజనేయులు, ఎం.పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీం వజాహత్, బసవ పున్నయ్య, ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బి. హెచ్ ఎం.కే. గాంధీలను ఈ కమిటీలో మెంబర్లుగా నామినేట్ చేయబడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..