తెలంగాణ, నారాయణపేట. 4 జూలై (హి.స.)
విద్యుద్ఘాతంతో కాడెద్దులు సజీవ దహనమైన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపొర్ల గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రైతు లచ్చన్న ప్రతిరోజు మాదిరిగా తన కాడెద్దులను పొలంవద్ద ఉన్న రేకుల షెడ్డు లో కట్టేసి నిన్న రాత్రి ఇంటికి వచ్చాడు. ఉదయం వెళ్లి చూడగా, అప్పటికే విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగి రేకుల షెడ్డు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. గుడిసెలో ఉన్న కాడెద్దులు సజీవ దహనమయ్యాయి. షెడ్డులోని ద్విచక్ర వాహనం, రైతు పంట సాగు కోసం నిలువ చేసుకున్న ఎరువులు, బియ్యం, కోళ్లు, తదితర సామాగ్రి కాలి బూడిదగా మారాయి. ఈ ఘటన చూసిన రైతు నిర్గాంతపోయి బోరున విలపించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు