తెలంగాణ, వికారాబాద్. 4 జూలై (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.పలువురు ముఖ్యమంత్రుల వద్ద ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు మర్చిపోలేదని, అనంతరం ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు