హైదరాబాద్, 4 జూలై (హి.స.)
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యట నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. జై బాపు.. హింసే మా ఆయుధం, జై భీం.. ఎస్సీ, ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్.. రాజ్యంగం అంటే మాకు లెక్కే లేదు.. వంటి స్లోగన్లతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గాంధీ భవన్తోపాటు ఎల్బీ స్టేడియం, సోమాజిగూడ, నగరంలోని పలు చోట్ల గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు.
దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది, ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లు, ఫెక్సీలు వాహనదారులను విశేషంగా ఆకర్షించాయి. వాహనాలు ఆపి మరీ వాటిని చదివారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..