వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం
హైదరాబాద్, 4 జూలై (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్
వైద్య ఆరోగ్యశాఖ


హైదరాబాద్, 4 జూలై (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఆమోదంతో వైద్య విధాన పరిషత్లో మొత్తం 2,363 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 944 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులను మినిమం టైమ్ స్కేల్ విధానంలో, మరో 1,332 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande