హైదరాబాద్, 4 జూలై (హి.స.)శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నాలా ఆక్రమణల పై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. నల్లగండ్ల చెరువు నుంచి చందానగర్ వరకు విస్తరించి ఉన్న లింగంపల్లి నాలా వెంట అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. నాలా విస్తరణకు 16 మీటర్లుగా నిర్ణయించిన అధికారులు, అక్రమంగా నిర్మించిన కట్టడాలపై శుక్రవారం కూల్చి వేతలు చేపట్టారు. ఈ చర్యలు నాలా ప్రవాహాన్ని సులభతరం చేసి, భవిష్యత్తులో ఎదురయ్యే వరద ముప్పును తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..