వైద్య మహానగరం ముక్తి లెవెల్ కారు పార్కింగ్ ది డెక్ లో దక్షిణ కోస్తా.రైల్వే జోన్ కార్యాలయం
విశాఖ, 4 జూలై (హి.స.) మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ భవనం(ది డెక్‌)లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. నగర నడిబొడ్డున షిప్‌ డెక్‌ మోడల్‌లో ఐకానిక్‌ బిల్డింగ్‌ల
వైద్య మహానగరం ముక్తి లెవెల్ కారు పార్కింగ్ ది డెక్ లో దక్షిణ కోస్తా.రైల్వే జోన్ కార్యాలయం


విశాఖ, 4 జూలై (హి.స.)

మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ భవనం(ది డెక్‌)లో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. నగర నడిబొడ్డున షిప్‌ డెక్‌ మోడల్‌లో ఐకానిక్‌ బిల్డింగ్‌లా అద్దాలతో నిర్మించిన ఈ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది 12 అంతస్థుల భవనం కాగా అందులో మూడు బేస్‌మెంట్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఏడు అంతస్థులు, టెర్రస్‌ ఉన్నాయి. పార్కింగ్‌కు కేటాయించిన ప్రాంతంలో 440 కార్లు, 250 ద్విచక్ర వాహనాలు నిలపవచ్చు. వీఎంఆర్‌డీఏ అవసరాలకు పోను మిగిలిన వాటిని (ఐదు అంతస్థులు-గ్రౌండ్‌ ఫ్లోర్‌, 3వ అంతస్థు, అందులో డెక్‌, 6వ అంతస్థు, ఏడో అంతస్థు, టెర్రస్‌) అద్దెకు ఇస్తామని ఇటీవల ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదో అంతస్థును రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ కోసం తీసుకుంది. నాలుగో అంతస్థును ఐటీ కార్యకలాపాల కోసం తీసుకునేందుకు భెల్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. తాజాగా విశాఖ రైల్వే అధికారులు ఆ భవనాన్ని పరిశీలించి రెండు అంతస్థులు తమకు ఇవ్వాలని కోరారు. అయితే ఒకటి (ఆరో అంతస్థు) సరిపోతుందని పేర్కొంటూ వీఎంఆర్‌డీఏ అధికారులకు గురువారం లేఖ సమర్పించారు. అందులో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande