హైదరాబాద్, 4 జూలై (హి.స.)
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని,అందుకోసం జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. గత ఏడాది ఆర్బాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు ఇవాళ వామపక్ష విద్యార్థి జేఏసీ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనే డిమాండ్తో సచివాలయం ముట్టడికి యత్నించింది. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఫలితంగా సెక్రెటేరియట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఆందోళనకారులను ఆరెస్ట్ చేసి పోలీస్టేషన్లకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..