శ్రీశైలం జలశయానికి పొటెత్తిన వరద
శ్రీశైలం, 4 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తిగా నిండటంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద ప్రవాహం కొనసాగుతోంది
శ్రీశైలం జలశయానికి పొటెత్తిన వరద


శ్రీశైలం, 4 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తిగా నిండటంతో అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 76,841 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. అలాగే, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 58,578 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 875.9 అడుగల వద్ద ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 167.88 టీఎంసీల నీరు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande