తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీ వేంకటేశ్వర దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 4 జూలై (హి.స.)తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని సార్లు సాధారణంగా, మరికొన్న
తిరుమల


తిరుమల, 4 జూలై (హి.స.)తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని సార్లు సాధారణంగా, మరికొన్ని సార్లు అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) తిరుమలలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తిరుమల భక్తులు కంపార్ట్‌మెంట్లు(Compartments) దాటి ఎన్‌జీ షెడ్స్ వరకు వేచి ఉన్నారు. నిన్న(గురువారం) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 64,015 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,786 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande