అమరావతి, 4 జూలై (హి.స.)మెగా డీఎస్సీని (Mega DSC) 23 రోజుల్లో అన్ని సవాళ్లను అధిగమించి విజయవంతంగా నిర్వహించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరినీ ఆయన ప్రశంసించారు. ప్రాథమిక ‘కీ’ ఇప్పటికే విడుదలైందని, అభ్యర్థుల సూచనలను సమీక్షించిన తర్వాత చివరి ‘కీ’ని విడుదల చేస్తామని చెప్పారు. వైసీపీ (YCP) డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టులో 31 కేసులతో కుట్రపన్నినా, పరీక్షలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగాయని వెల్లడించారు. ఎస్సీ ఉప వర్గీకరణ, క్రీడా కోటా వంటి నియమాలను ఖచ్చితంగా అనుసరించినట్లు వివరించారు. 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు దాఖలు చేయగా, 92.9% మంది పరీక్షలకు హాజరైనట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి