అమరావతి, 4 జూలై (హి.స.)మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘దాస్య శృంఖలాలతో స్వేచ్ఛకు దూరమైన సమాజంలో పోరాట జ్వాలలు రగిలించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆ వీరుడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. మన్యం ప్రజల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగిన అల్లూరి పోరాట పంథా చిరస్మరణీయం. తెలుగు జాతి పౌరుషానికి ప్రతీకగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయనలోని పోరాట స్ఫూర్తిని, అణగారిన వర్గాలకు అండగా నిలిచే తత్వాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది’’ అని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) ట్విట్టర్ వేదికగా తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి