పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల విమర్శలు
అనంతపురం , 4 జూలై (హి.స.) రాష్ట్రంలో పరామర్శల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచకాన్ని, అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అభివ
పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల విమర్శలు


అనంతపురం , 4 జూలై (హి.స.) రాష్ట్రంలో పరామర్శల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచకాన్ని, అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే, జగన్ మాత్రం అస్థిరతను సృష్టించేందుకు అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల నుంచి పాఠశాల పిల్లల భోజనాల వరకు బకాయిలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఆ వ్యవస్థను గాడిన పెట్టి, ప్రజలకు ప్రశాంతత, అభివృద్ధి, భరోసా ఇచ్చే పాలన అందిస్తున్నాం అని తెలిపారు.

అయితే, ఈ అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారని పయ్యావుల మండిపడ్డారు. పరామర్శల పేరుతో పర్యటిస్తూ, అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారు. 'రప్ప రప్ప' నరుకుతామంటే మంచిదేగా అని వారిని వెనకేసుకొస్తున్నారు. ఆయన తీరు సమాజానికి ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. జగన్ పోకడల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande