మంగళగిరి, 4 జూలై (హి.స.) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఆయన ఇద్దరు కుమారులు అకీరా నందన్(Akira Nandan), మార్క్ శంకర్(Mark Shankar)తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం వారితో కలిసి మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. అక్కడ జలజీవన్ మిషన్ కింద రూ.1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, తిరిగి మధ్యాహ్నం 1:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఉప కలెక్టర్ బి.సహాధిత్ వెంకటత్రివినాగ్, ఎక్సైజ్, ప్రొహిబిషన్ జిల్లా అధికారిణి షేక్ ఆయేషాబేగం, జనసేన జిల్లా ఇన్‌ఛార్జి షేక్‌రియాజ్, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాశీనాథ్ తదితరులు పర్యవేక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి