కర్నూలు, 4 జూలై (హి.స.)పొలం పనులకు వెళ్లిన ఓ వ్యవసాయ కూలీని అదృష్టం వరించింది. ఏపీ(Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా(Kurnool District)కు వర్షాకాలం వచ్చిందంటే చాలు చుట్టు పక్కన గ్రామంలోని ప్రజలు తరలివస్తారు. అక్కడ వజ్రాలు లభ్యమవుతాయని వచ్చి వెతకడం ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. ఒక వజ్రం దొరికితే చాలు జీవితమే మారిపోతుంది అనుకుంటారు.
ఈ క్రమంలో తొలకరి వర్షాలు పడినప్పుడు వజ్రాల కోసం రైతులు పొలాల్లో వెతుకులాట ప్రారంభించడం తెలిసిందే. కానీ.. ఓ మహిళ వ్యవసాయ కూలీకి వజ్రం కోసం వెతకకుండానే లభ్యం కావడం అదృష్టమని పలువురు చెబుతున్నారు. ఇవాళ(శుక్రవారం) వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ మహిళ వ్యవసాయ కూలీకి జాక్‌పాట్ తగిలింది. ఈ తరుణంలో తుగ్గలి మండలం పెండేగల్లు గ్రామంలో 15 క్యారెట్ల బరువైన వజ్రం లభ్యమైంది. వ్యవసాయ కూలీలు, రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళా కూలీ పొలం పనులు చేస్తుండగా తనకు వజ్రం దొరికింది. దీనికి సంబంధించి బేరం కుదరకపోవడంతో ఇంకా కొనుగోలు కానట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి