విశాఖపట్నం, 4 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh) హోం మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం విశాఖపట్నం మహారాణి పేటలోని జగన్నాథ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామి వారికి హోంమంత్రి అనిత(Home Minister Anitha) పట్టువస్త్రాలను సమర్పించారు. మొదటగా ఆలయ మర్యాదలతో హోం మంత్రి అనితకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రాముని అవతారంలో నేడు జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానంతరం పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పాండురంగ స్వామి ఆలయం నుంచి విశాఖపట్నం మహారాణి పేటలోని జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు దక్కిన భాగ్యమని అన్నారు. ఏటా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని పేర్కొన్నారు. పది రోజులు పది అవతారాల్లో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి