అమరావతి, 5 జూలై (హి.స.)
అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ... 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. 10 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్ కడితే 2.5 ఎకరాలు ఇస్తామన్నారు. అంతేకాకుండా భాజపా కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ