అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్లు
హైదరాబాద్, 6 జూలై (హి.స.) అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్కు చెందిన దూదేకుల శివసాయి(28), మట్టాడ ప్రవీ
అక్రమ గంజాయి


హైదరాబాద్, 6 జూలై (హి.స.)

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘటన జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్కు చెందిన దూదేకుల శివసాయి(28), మట్టాడ ప్రవీణ్ (27), కోడలనాయిల్ గణేష్ (25), కూకట్పల్లికి చెందిన పావులూరి కళ్యాణ్ చక్రవర్తి (25) ఈ నలుగురు కలిసి జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలోని రోడ్ నెం.8 లోని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి వాటర్ వర్క్స్ కార్యాలయం సమీపంలో శనివారం అర్ధరాత్రి అక్రమంగా గంజాయి అమ్మకం, రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు . దాడులలో సంఘటనా స్థలంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కేజీల, 109 గ్రాముల డ్రై గంజాయి స్వాధీనం చేసుకుని, పల్సర్ బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, నిందితులను రిమాండ్ కి తరలించినట్లు జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సీఐ వాసుదేవరావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande