మహబూబాబాద్, 6 జూలై (హి.స.)
మహబూబాబాద్ జిల్లా కొరవి
మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పూజారులు కొత్త నీటి (పారుతున్న నది నుండి)ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జమాండ్లపల్లి మున్నేరు నది నుండి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. గ్రామ పొలిమేరల నుండి మేల తాళాలతో వేదమంత్రాలతో ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అధికారులు పాలక మండలి చైర్మన్, సభ్యులు, ధర్మకర్తలు స్వాగతం పలికారు.
ఏటి నీటిని ఆలయంలోని ముఖ మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు స్వామి వారికి మహన్యాసక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. గణపతి పూజ తో ఆరంభమైన ప్రత్యేక పూజలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ హిందువులకు తొలి ఏకాదశి తొలి పండుగని, పాడి పంటలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తొలి ఏకాదశి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..