తెలంగాణ, 5 జూలై (హి.స.)
మన సంస్కృతి, సాంప్రదాయాలను మరింత పెంపొందించే విధంగా బోనాల ఉత్సవాల ను ఘనంగా జరుపుకుందామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కోటి 62 లక్షల రూపాయల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు, అధికారులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ చేసినా అమలుకు నోచుకోలేదని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు