అమరావతి, 5 జూలై (హి.స.)
కమలాపురం: కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్న బాలాజీ విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ