శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. ప్రస్తుత నీటిమట్టం?
శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగ
శ్రీశైలం


శ్రీశైలం, 5 జూలై (హి.స.)శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) జలకళ సంతరించుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 67,019 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 876.90 అడుగులకు చేరుకుంది.

కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరికలతో మరింత వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు, ప్రస్తుత 166.3148 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande