అమరావతి, 5 జూలై (హి.స.)
సింహాచలం: విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న భక్తులకు ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచా వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. పునాదుల్లో కాంక్రీట్ వేయకపొవడంతో బరువు ఎక్కువై భారీ షెడ్డు కూలింది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ