నెల్లూరు.లోని బారా షహీద్ దర్గా వద్ద భక్తుల సందడి
అమరావతి, 5 జూలై (హి.స.) నెల్లూరు: నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద భక్తుల సందడి మొదలైంది. రొట్టెల పండగకు ఒకరోజు ముందుగానే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరగనుంది. మత సామరస్యానికి చిహ్నంగా, బారాషహీద్‌ల త్యాగ
నెల్లూరు.లోని బారా షహీద్ దర్గా వద్ద భక్తుల సందడి


అమరావతి, 5 జూలై (హి.స.)

నెల్లూరు: నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా వద్ద భక్తుల సందడి మొదలైంది. రొట్టెల పండగకు ఒకరోజు ముందుగానే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరగనుంది. మత సామరస్యానికి చిహ్నంగా, బారాషహీద్‌ల త్యాగనిరతిని స్మరిస్తూ ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ఈక్రమంలో స్వర్ణాల చెరువు వద్ద సందర్శకుల తాకిడి మొదలైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande