అనంతపురం.జిల్లా గుంతకల్లులో కలుషిత నీరు తాగి 30.మంది అస్వస్థతకు గురి
అమరావతి, 5 జూలై (హి.స.) అనంతపురం జిల్లా గుంతకల్లులో కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థతకు గురయ్యారు. తిలక్ నగర్ 11వ వార్డులో కుళాయిల నుంచి వచ్చిన నీటిని తాగడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా కుళాయి నీరు తాగి తీవ్రమైన
అనంతపురం.జిల్లా  గుంతకల్లులో కలుషిత నీరు తాగి 30.మంది అస్వస్థతకు గురి


అమరావతి, 5 జూలై (హి.స.)

అనంతపురం జిల్లా గుంతకల్లులో కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థతకు గురయ్యారు. తిలక్ నగర్ 11వ వార్డులో కుళాయిల నుంచి వచ్చిన నీటిని తాగడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. అంతేకాకుండా కుళాయి నీరు తాగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వారు వెల్లడించారు. బాధితులంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి కుళాయి నీటిని పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande