అమరావతి, 5 జూలై (హి.స.)
తిరుపతి (ఎస్వీయూ), : శ్రీవారి పాదాల చెంత.. 1954 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటైన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదిగి 70 వసంతాలు పూర్తి చేసుకుంది. 73 విభాగాలతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ అరుదైన విద్యాధామంగా వెలుగొందుతోంది. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో పలు రంగాల్లో ఉన్నతంగా స్థిరపడటంలో ఓ దిక్సూచిగా నిలిచిందనడంలో సందేహం లేదు. వర్సిటీలోని పలు కీలక కోర్సులు నేటికీ యువతను ఆకట్టుకుంటూ వారి ఉపాధికి బాటలు వేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ