వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భారత మాజీ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా.!
హైదరాబాద్, 5 జూలై (హి.స.) టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా, ఇప్పుడు తన తొలి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. క్ర
సురేష్ రైనా


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా, ఇప్పుడు తన తొలి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. క్రికెట్ నేపథ్యంలో రానున్న తమిళ చిత్రంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహిస్తుండగా.. డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణ సంస్థ కింద శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రైనాకు ఇది పరిచయమైన అంశమైనందున, ఆయన పాత్రలో నిజమైన అనుభవం కనిపించనుందన్న అంచనాలు మొదలయ్యాయి. కాగా, ఇప్పటికే పలువురు క్రికెటర్లు సినిమా రంగంలో తమ ప్రతిభ చాటుకున్న సంగతి తెలిసిందే. 2022లో విక్రమ్ హీరోగా వచ్చిన చిత్రం కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్.. ఇంటర్ పోల్ అధికారి పాత్రలో కనిపించాడు. ఫ్రెండ్ షిప్ చిత్రంలో కన్నడ నటుడు అర్జున్తో కలిసి హర్భజన్ సింగ్ అలరించిన సంగతి తెలిసిందే. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇప్పటికే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని తన నిర్మాణ సంస్థ కింద 'లెట్స్ గెట్ మ్యారీడ్' మూవీని రూపొందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande