హైదరాబాద్, 5 జూలై (హి.స.)
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని, దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ప్రజాభవంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొని బాగా ఎదగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్