నెల్లూరు, 6 జూలై (హి.స.)నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ నేటి నుంచి వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఐదురోజుల పాటు కొనసాగే ఉత్సవాల కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పా్ట్లను పూర్తి చేసింది. రొట్టెల పండుగ భాగంగా మొదటి రోజు రాత్రి సందల్‌మాల్, సోమవారం అర్ధరాత్రి బారాషహీద్‌ల గంథోత్సవాన్ని సంబురంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం నుంచి పండుగ ప్రారంభం అవుతుంది. అనంతరం బుధవారం తహలీఫాతేహా, గురువారం రాత్రి పండుగ ముగింపు కార్యక్రమం ఉంటుంది. బారాషహీద్ దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఒకరికొకరు రొట్టెలను మార్చుకుంటారు. ఈ రోట్టెల పండుగ నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,600 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి