జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది
అమరావతి, 6 జూలై (హి.స.) కోరుట్ల, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి న
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది


అమరావతి, 6 జూలై (హి.స.)

కోరుట్ల, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఐదేళ్ల చిన్నారి శనివారం రాత్రి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఆకుల రాము-నవీన దంపతులకు ఇద్దరు సంతానం. రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లగా.. నవీన పిల్లలతోపాటు ఇక్కడే ఉంటున్నారు. వీరి కూతురు హితీక్ష(5) శనివారం సాయంత్రం పాఠశాలకు నుంచి తిరిగొచ్చాక ఇంటి బయట ఆడుకుంటోంది. రాత్రి 8 గంటలు దాటినా ఇంట్లోకి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. పొరుగునే నివసించే విజయ్‌ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక విగతజీవిగా కనిపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande