అమరావతి, 6 జూలై (హి.స.):అన్నదాత-సుఖీభవ పథకం కింద లబ్ధి పొందేందుకు గత నెల 30వరకు వెబ్‌ల్యాండ్‌లో నమోదైన రైతుల భూమి ఖాతాలకు అర్హత కల్పించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాత సుఖీభవకు అర్హతపై రైతుల ఫిర్యాదులను ఈ నెల 10వ తేదీ వరకు రైతుసేవా కేంద్రాల ద్వారా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి దశలో.. ప్రాథమిక దశలో తిరస్కరణకు గురైన రికార్డులు, రెండో దశలో ధ్రువీకరణలో అనర్హతకు గురైన రికార్డులను గ్రీవెన్స్ మాడ్యూల్‌లో పొందుపర్చినట్లు చెప్పారు. దీంతో పాటు తహసీల్దార్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న ఖాతాలను కూడా గ్రీవెన్స్ మాడ్యూల్‌లో చేర్చినట్లు తెలిపారు. వీటిపై రైతుసేవాకేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ అధికారులు అవగాహనతో ఉండాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ