హైదరాబాద్, 6 జూలై (హి.స.)
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాజుగా బతికిన రైతును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రోడ్డు పాలు చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో ఎరువులు, విత్తనాలు అమ్మిన చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూరియా కోసం భారీ క్యూ లైన్ లే కనిపిస్తున్నాయని వివరించారు. యూరియా మాత్రమే కాదు డీఏపీ, పొటాష్ కోసమూ రైతులకు తిప్పలు పడుతున్నారని తెలిపారు.
ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి మరీ ఘోరం.. అని విమర్శించారు. వానాకాలం సీజన్ మొదలై నెల రోజులు గడిచిన తర్వాత కూడా ఎరువుల కొరత రైతులను వేధిస్తున్నది అంటే సర్కారు ముందు చూపులేని తనం ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే కారణం అని విమర్శించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా ఉన్న ఎరువులను బ్లాక్ చేసి ఎక్కువ ధరకు అమ్మే వారిని కట్టడి చేయకుంటే రైతులు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్