ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి పని చేస్తుంది.. డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ, ఖమ్మం. 6 జూలై (హి.స.) ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి, కుట్రలు పన్నుతున్నాయి... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి పని చేస్తుందని డిప్యూ
డిప్యూటీ సీఎం భట్టి


తెలంగాణ, ఖమ్మం. 6 జూలై (హి.స.)

ప్రజా ప్రభుత్వం చేపడుతున్న

సంక్షేమ కార్యక్రమాలతో పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి, కుట్రలు పన్నుతున్నాయి... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం నిటారుగా నిలబడి పని చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం మధిరలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్దిడి వరకూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం కేవలం ఏడాదిన్నర కాలంలోనే అందించాం అన్నారు. ప్రజల అవసరాలను ఓట్లుగా మార్చుకొని గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు వారి అవసరాలు తీర్చుకున్నారు. తప్ప ప్రజల ఇబ్బందులు తీర్చలేదని డిప్యూటీ సీఎం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande