సర్కార్ స్విచ్ఛాఫ్ మోడ్లో ఉంది.. హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, 6 జూలై (హి.స.) తెలంగాణ సర్కార్ స్విచ్ఛాఫ్ మోడ్లో ఉందని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాలైన మీడియాతో మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు
హరీష్ రావు


హైదరాబాద్, 6 జూలై (హి.స.)

తెలంగాణ సర్కార్ స్విచ్ఛాఫ్ మోడ్లో ఉందని బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాలైన మీడియాతో మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. సాధారణంగా కృష్ణాలోని జూలై, ఆగస్టు చివరన వరదనీరు వస్తుందని.. కానీ, అనూహ్యంగా మే నెలలోనే కృష్ణాకు వరద నీరు రావడంతో రెండు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నింపుకునేందుకు చక్కని అవకాశం ఉందని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వమేమో స్విచ్ఛాఫ్ మోడ్లో ఉందని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు బీఆర్ఎస్ మీద నిత్యం బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. వదర నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని హరీశ్ ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande