తిరుపతి,6 జూలై (హి.స.):తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితుల రిటైర్మెంట్‌కు సంబంధించి టీటీడీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు. దీంతో 65 ఏళ్ల వయసు దాటినప్పటికీ ఆయన మునుపటిలాగే ప్రధాన అర్చకుడిగా కొనసాగనున్నారు. ఈ నిర్ణయంతో గతంలో టీటీడీ ఆలయాల్లో రిటైరైన ప్రధాన అర్చకులు, సాధారణ అర్చకులు సైతం తమకూ ఆ ఉత్తర్వులను వర్తింపజేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఏర్పడింది. వివరాలు.. టీటీడీ నిర్వహణలో ఉన్న తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పాత మిరాశీ కుటుంబానికి చెందిన ఏపీ శ్రీనివాస దీక్షితులు ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. టీటీడీ సర్వీసు నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన ప్రధాన అర్చకులు, సాధారణ అర్చకులు సహా ధార్మిక విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ రిటైర్ కావాలి. ఈ క్రమంలో శ్రీనివాస దీక్షితులు ఈ ఏడాది మే 31న రిటైర్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదే నెల 29న ఆయన రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను టీటీడీ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ