హైదరాబాద్, 6 జూలై (హి.స.)
ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల
హామీలకు విలువలేనప్పుడు ప్రజలు కూల్చివేతల మార్గమే ఎన్నుకుంటారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హిందూ స్మశాన వాటికలో అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ఎత్తివేయాలని 50 కాలనీల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 52వ ధర్నా కార్యక్రమానికి ఈటల ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఇదే సమస్యపై కాలనీవాసులకు మద్దుతుగా మూడు సార్లు రావడం జరిగిందని, అయిన సమస్య పరిష్కారం కాకపోవడం దరదృష్టమన్నారు. అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా నిలిచిన ఆయన డంపింగ్ యార్డును ఎత్తివేయకపోవడం కారణం ఏమిటని ప్రశ్నంచారు. ప్రజాసమస్యల పరిష్కారానికే కదా మమ్ములను వారి ప్రతినిధులుగా ఎన్నుకున్నది వారి సమస్యలు తీర్చకుంటే వారికి ఏమి చెప్పుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు తమ మార్గం తాము ఎన్నుకుంటారని తెలిపారు. మరో సారి ఇక్కడికి రానని సమస్య పరిష్కారం కాకుంటే డంపింగ్ యార్డును ప్రజలతో కలిసి కూల్చివేయడానికి వస్తానని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్