హైదరాబాద్, 6 జూలై (హి.స.)
కేసీఆర్ పరిపాలనలో నేనే రాజును నేనే మంత్రిని అనుకున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. మూడో సారి కూడా ముచ్చటగా వాళ్లే వస్తామని కేటీఆర్ ప్రగల్బాలు పలికారని అన్నారు. అలాంటి కేటీఆర్ 2014, 2018లో వాళ్లు ఇచ్చిన మ్యానిఫెస్టోపై కేటీఆర్ చర్చ పెట్టాలని చెప్పారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం అమలు చేశారో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్దకు కేటీఆర్ రావాలని తాను సమయం ఫిక్స్ చేస్తున్నానని చెప్పారు. తానే వస్తానని 2014, 2018 మేనిఫెస్టోలను తీసుకువస్తానని చెప్పారు. సిరిసిల్లకు రమ్మంటే సిరిసిల్లకు వస్తా, సిద్ధిపేటకు రమ్మంటే సిద్ధిపేటకు వస్తానని సవాల్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరు వచ్చినా సరే అని చెప్పారు. కేటీఆర్ ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడని, ఆయన అనేక మానసిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాడని సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఖర్గే సభలో సీఎం రేవంత్ కాంగ్రెస్ వచ్చిన తరవాత అభివృద్ధిపై చర్చ పెడదామని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్ ప్రెస్ క్లబ్కు రావాలని చర్చకు సిద్ధమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్