తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 6 జూలై (హి.స.)
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవాని
సొంత ఇంటి కల నెరవేరుతుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని, ఇండ్లు కట్టుకోవాలనే ఆడబిడ్డల చిరకాల కోరికని ఇందిరమ్మ ఇండ్ల రూపం లో ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
ప్రతి లబ్ది దారునికి ఇందిరమ్మ ఇల్లు లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రకటనలకి పరిమితమైందని, పేద వానికి ఎటువంటి లబ్ది చేకూరలేదని అన్నారు, ప్రజానీకం ని మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రతి ఏడాది కి ఒక్కో నియోజక వర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు. అదనంగా మరో 1500 ఇండ్లు కేటాయించాలని కలెక్టర్ ని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు