హైదరాబాద్, 6 జూలై (హి.స.) కేంద్రం
నుంచి ఏకాణా తేలేని వారు
కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ చీఫ్ రాంచందర్ రావు లేక రాయడంపై ఆయన మండిపడ్డారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్, రాంచందర్ రావుకు ప్రతి లేఖ రాశారు. అందులో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతేందని రామచందర్ రావును ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగడునా వంచిస్తోందని అన్నారు. గత మూడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హమీలను విస్మరించారని మండిపడ్డారు.
వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వంచించిన చరిత్ర వారిదని ఆక్షేపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల మెనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పించన్లు ఇస్తామని అన్నారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్