అమరావతి, 6 జూలై (హి.స.) రాష్ట్రంలో త్వరలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ), కేంద్ర ఉప్పునీటి రొయ్యల పరిశోధన సంస్థ (సీఐబీఏ) ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని ఏపీ స్టేట్ ఆక్వా డెవల్‌పమెంట్ అథారిటీ కో-వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి చెప్పారు. శనివారం మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్‌తో కలిసి రొయ్యల వ్యాధులపై ఆక్వా భాగస్వాములతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న ఎన్‌ఎ్‌ఫడీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని, చెన్నైలో ఉన్న కేంద్ర ఉప్పునీటి రొయ్యల పరిశోధన సంస్థ(సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రేకి్‌షవాటర్ ఫర్ ఆక్వాకల్చర్)కు ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు రాసినట్లు తెలిపారు. దీంతో త్వరలో ఈ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటవుతాయన్నారు. కాగా, ఆక్వా రైతులకు రొయ్యల సాగులో ఉత్తమ విధానాలపై అవగాహన కల్పించనున్నట్లు ఆనం తెలిపారు.
రైతులకు వ్యాధి రహిత రొయ్య పిల్లలను సరఫరా చేయాలని హేచరీల నిర్వాహకులకు సూచించారు. భీమవరం, కాకినాడ, అమలాపురం, బాపట్ల, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాల్లో ఈహెచ్‌పీ, వైట్‌గట్, విబ్రియో ఇన్ఫెక్షన్స్ బారిన పడిన రొయ్యల నుంచి నమూనాలు సేకరించినట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వైర్‌సలు ఆశిస్తున్నాయని, ఇందుకు వాతావరణ మార్పులు, చెరువుల్లో అమ్మోనియా, నైట్రేట్ తీవ్రత కారణమని గుర్తించినట్లు తెలిపారు. మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. తల్లి రొయ్య ద్వారా వ్యాధి వచ్చే అవకాశం లేదని, మేతగా వాడే లైవ్ ఫీడ్ వల్ల ఈ వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ