రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేటీఆర్ ఫైర్..
హైదరాబాద్, 6 జూలై (హి.స.) రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు పడుతోన్న కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాంట్ఫామ్ ''X'' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా లేదని.. రుణమాఫీ
కేటీఆర్


హైదరాబాద్, 6 జూలై (హి.స.) రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం అన్నదాతలు పడుతోన్న కష్టాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాంట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా లేదని.. రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా కరువొచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వం అడిగినట్లుగానే ఆధార్ కార్డులు ఇచ్చినా, రైతుకి కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఎందుకుందో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 266.50 ఉండాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియలని అన్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి నడిపిస్తుంది ఎవరని ధ్వజమెత్తారు. ఈ కృత్రిమ కొరత ఎవరి వల్ల ఏర్పడుతుందో విచారణ జరిపించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande