తెలంగాణ, నాగర్ కర్నూల్. 6 జూలై (హి.స.)
ప్రజల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలకు కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అందరూ సహకరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా తాను చేయగలిగింది అంతే మాత్రమేనని, చట్టం తన పని తానే చేసుకుంటుందన్నారు. అలాంటి వారిని ప్రజలే తగిన బుద్ధి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
ఆదివారం అమ్రాబాద్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన, అభివృద్ధి పనుల్లో భాగంగా కొందరి నిర్మాణాలు తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు దీనికి సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, కొందరు మాత్రం రాజకీయ కోణంలో దీనికి అడ్డుపడతున్నారని అన్నారు. అవసరమైతే ఆర్థికంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు