మార్నింగ్ వాక్లో ఆలేరు ఎమ్మెల్యే – ప్రజలతో నేరుగా ముఖాముఖీ
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 6 జూలై (హి.స.) ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రజలతో మార్నింగ్ వాక్ నిర్వహించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. వివరాల్లోకెళితే ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పలువార్డుల్లో ప్రజలతో మార్నింగ్ వాక
ఆలేరు ఎమ్మెల్యే


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 6 జూలై (హి.స.)

ప్రజల సమస్యలు తీర్చేందుకు

ప్రజలతో మార్నింగ్ వాక్ నిర్వహించారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. వివరాల్లోకెళితే ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పలువార్డుల్లో ప్రజలతో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకొని పలుసమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి ఏ విధంగా ఉందో లబ్ధిదారులతో మాట్లాడారు. తొందరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. అనంతరం ఆలేరు పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande