తెలంగాణ, షాద్నగర్. 6 జూలై (హి.స.)
పెంపుడు కుక్కలకు యాంటీ
రేబిస్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని పశువైద్యశాలలో పశువైద్యశాఖ, యానిమమల్స్ కేర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కుక్కల ద్వారా మనుషులకు సోకే రేబిస్ వ్యాధి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పెంపుడు కుక్కలను తప్పకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు.
రేబిస్ వ్యాధికి చికిత్స లేదని, వ్యాక్సిన్ ఒకటే మార్గమన్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు