యూపీ రైతుల వినూత్న ప్రయోగం.. మోదీ, యోగి బ్రాండ్ పేరుతో మామిడిపండ్లు
యూ.పీ, 6 జూలై (హి.స.) ఉత్తరప్రదేశ్‌లో రైతులు మామిడిపండ్లకు కొత్త కొత్త పేర్లు పెడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా మోదీ, యోగీ , అమిత్ షా , రాజ్‌నాథ్, ములాయం, అఖిలేశ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతల పేర్లు పెట్టి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడ
యోగి మోదీ మ్యాంగోస్


యూ.పీ, 6 జూలై (హి.స.)

ఉత్తరప్రదేశ్‌లో రైతులు మామిడిపండ్లకు కొత్త కొత్త పేర్లు పెడుతూ జనాలను ఆకర్షిస్తున్నారు. తాజాగా మోదీ, యోగీ , అమిత్ షా , రాజ్‌నాథ్, ములాయం, అఖిలేశ్ లాంటి ప్రముఖ రాజకీయ నేతల పేర్లు పెట్టి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాజధాని లక్నోలో జరుగుతున్న మూడు రోజుల మ్యాంగో ఫెస్టివల్‌లో సందడి చేస్తున్నాయి. ఈ ప్రదర్శన నిన్న‌ మొదలుకాగా.. దాదాపు 1000 రకాల మామిడిపండ్లను రైతులు ఇక్కడికి తీసుకొచ్చారు.వీటిలో మోదీ, యోగి పేర్లతో ఉన్న మామిడిపండ్లకు గిరాకీ బాగా అవుతోంది. అక్కడికి వచ్చే సందర్శకులు వీటి గురించే చర్చించుకుంటున్నారు. అయితే మోదీ పేరుతో ఉన్న మామిడిపండ్ల రకాన్ని బాగ్వాన్ ఉపేంద్ర కుమార్ అనే వ్యక్తి సాగు చేశారు. అలాగే యోగి రకం మామిడిని మ్యాంగోమ్యాన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత హాజీ కలీముల్లాఖాన్ సాగు చేశారు.ఈ మామిడిపండ్లు ఒక్కోటి కిలో బరువు ఉన్నాయి. రుచి కూడా అద్భుతంగా ఉందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ మామిడి వంగడం విత్తనం చాలా చిన్న పరిణామంలో ఉంటుంది. ఇదిలాఉండాగ మామిడిపండ్ల సాగులో వైవిధ్యాన్ని చూపిస్తున్న హాజీ కలీముల్లాఖాన్‌కు 2008లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande