అమరావతి, 6 జూలై (హి.స.)
తనను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించడం ఎంతో సంతోషంగా ఉందని క్యాన్సర్ బాధితుడు ఆకుల కృష్ణ అన్నారు. ఆరోగ్య పరిస్థితి ఉన్న అత్యంత విషమంగా కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నానని సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారని, ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు.
కాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ తొలి నుంచి టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్య క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి