అమరావతి, 6 జూలై (హి.స.)దోమల నిర్మాలను ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఏఐ ఆధారితంగా ఓ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
దోమల బ్రీడింగ్ నిర్మూలించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
మొదట 6 మున్సిపల్ కార్పరేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉంటే వర్షాకాలం ప్రారంభమైన సంగతి తెలిసిందే. వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో ముందుగానే నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దోమలు బ్రీడింగ్ అవ్వకుండా ఆపేస్తే అసలు సమస్యనే ఉండదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి